top of page

ధ్యానం

Ayyappa-Meditation.jpg

ధ్యానం చేసే పద్దతి

  1. చేతులు రెండు ఒకదానితో ఒకటి .. వేళ్లలో వేళ్ళును కలపండి.

  2. కాళ్ళు రెండు .. పాదాలు ఒకదాని పై ఒకటి క్రాస్ చేసి కూర్చోండి. 

  3. నెమ్మదిగా కళ్ళు రెండూ మూసుకోండి.

  4. సహజంగా జరుగుతున్న శ్వాస మీద ధ్యాస పెట్టి, శ్వాస ప్రక్రియను గమనించండి. 

ధ్యానం సర్రిగా కుదరాలంటే సరియిన ఆసనం అన్నది ముఖ్యం. సహజ, సుఖ స్థిర ఆసనంలో కూర్చుంటే శరీరంలో ఎలాంటి అసౌకర్యాలు కలగవు. ధ్యానం చేయాలంటే చాలామంది నేలపై మాత్రమే కూర్చోవాలని అనుకుంటారు. కుర్చీపై గాని, సోఫాపై గాని కూడా సౌకర్యంగా, సుఖంగా కూర్చోవచ్చు. మనం ఎన్నుకునే ఆసనం ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా మన దృష్టి మొత్తం అంతర్ముఖం చేసుకోవటానికి సహాయకరంగా ఉండాలి. 

మనం ధ్యానం చేసినప్పుడు ఏమి జరుగుతుంది?

  1. మనం ధ్యానంలో, నెమ్మదిగా శ్వాసను గామినిస్తూ ఉంటే, మనస్సు సహజంగా క్లియర్ అవుతుంది, ఆలోచనారహిత స్థితి యొక్క అనుభవం కలుగుతుంది. 

  2. మనసులోని ఆలోచనారహిత స్థితి మన భౌతిక దేహంలోకి విశ్వ శక్తిని ప్రవహింప చేస్తుంది. 

  3. క్రమేణా విశ్వ శక్తి ప్రవాహం వల్ల నిద్రాణమై ఉన్న మూడవ కన్ను ఉత్తజితం అవుతుంది, సూక్ష్మ జ్ఞానాన్ని పొంది జ్ఞానోదయం కలుగుతుంది. 

  4. ఈ ప్రక్రియ ద్వారా నెమ్మదిగా, విశ్వ చైతన్యం యొక్క అనుభవాన్ని పొంది, మన పై ఉన్న అతీత శక్తిని గుర్తించగలం. 

పిరమిడ్ ధ్యానం

  1. పిరమిడ్ లోపల చేసే ధ్యానం మూడు రెట్లు ఎక్కువ శక్తివంతమైనది

  2. పిరమిడ్ లోపల లేదా పిరమిడ్ కింద చేసే ధ్యానాన్ని పిరమిడ్ ధ్యానం అంటారు.

  3. పిరమిడ్‌ లోపల ధ్యానం చేసినప్పుడు చాలామంది ప్రశాంతతతో కూడిన ఆనందానుభూతులను అనుభవిస్తారు.

  4. పిరమిడ్లు ప్రారంభ దశలో ఉన్న ధ్యానులకు శక్తితో కూడిన వాతావరణాలను అమర్చి అద్భుతమైన, లోతైన ధ్యాన స్థితిని పొందేందుకు సహాయ పడగలవు. 

  5. భౌతిక శరీరంలో కలిగే ఒత్తిడిని తగ్గించడానికి పిరమిడ్లు సహాయపడతాయి

పిరమిడ్ ధ్యానంపై ప్రయోగాలు చేసిన చాలా మంది తమ శరీరంలో పూర్తి విశ్రాంతిని అనుభవిస్తున్నట్లు వర్ణించారు. అనవసరమైన, సరి కానీ  ఆలోచనలు నిర్మూలించి, చివరకు లోతైన అంతః చైతన్య  స్థితిని సాధించారు.

Visitors Count
bottom of page